జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా డాక్టర్ బి.హెచ్. సుమిత్రా నందన్ సేవలు అభినందనీయం – శ్రీమతి పల్లవి

ఆర్టీఐ చట్టం ద్వారా ప్రశ్నిస్తేనే ప్రగతి

హైదరాబాద్, నవంబర్ 25:

సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా ప్రశ్నిస్తేనే సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి ప్రగతి సాధ్యమవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ పి.ఎస్. నాయుడు పేర్కొన్నారు.

జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 25న హైదరాబాద్‌లోని హోటల్ జీఆర్‌టీ గ్రాండ్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పల్లవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ నారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 20 జిల్లాల నుంచి, తెలంగాణలోని 6 జిల్లాల నుంచి సంఘం కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారని తెలిపారు.

సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ సుదీర్ఘకాలంగా సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అందిస్తున్న సేవలు అభినందనీయమని జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పల్లవి కొనియాడారు. ఆయన సేవలకు హాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపించారు.

6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ గుత్తికొండ కొండలరావు చేతుల మీదుగా శ్రీమతి పల్లవి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘం రాష్ట్ర, జాతీయ నాయకులు, వివిధ జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి