పట్టణంలోని పిల్లపేట వీధిలో గోకులాల ప్రారంభోత్సవానికి హాజరైన జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు
చీపురుపల్లి పట్టణంలోని పిల్ల నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు గారు ,ఎక్స్ ఆర్ ఈ సి ఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు గారు, బీసీ సెల్ అధ్యక్షులు ముల్లు రమణగారు, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ గవిడి నాగరాజు గారు, టిడిపి నాయకులు రౌతు నారాయణరావుగారు, రాంబాబు గారు, టిడిపి మహిళా నాయకురాలు హారతి సాహు గారు, జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా భారతదేశంలో సనాతన ధర్మం పరిరక్షణ లో భాగంగా హిందువులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా పూజించే కన్నతల్లి లాంటి గోమాతను రక్షించుకునే బాధ్యత ప్రజలందరి పైన ప్రభుత్వాలు పైన ఎంతైనా ఉందని అలాంటి గోమాతకు సంరక్షణగా నిలిచి వాటి అభివృద్ధి కి తోడ్పడే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలవ్యవధిలోనే సుమారు 12500 గోశాల షెడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలన కాలంలో కేవలం 250 షెడ్లు నిర్మాణం మాత్రం చేపట్టడం వారి అసమర్ధతకు నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా పశువుల సంరక్షణకు ప్రభుత్వం మినీ గోకులం పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకు, బిసి ఎస్సీ, ఎస్టీ దళిత గిరిజన నిరుపేద పాడి రైతు కుటుంబాలకు ప్రభుత్వ రాయితీపై పశువుల షెడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు . ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో MGNREGS అధికారులు,ఎన్డీఏ కూటమి
నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు