సాలూరు పట్టణంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు .
సాలూరు పట్టణంలో జనసేన అధినేత డిప్యూటీ సి.ఎం మరియు మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా
శ్రీ పంచముఖేశ్వరాలయం, శ్రీ శ్యామలాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సర్వమత ప్రార్ధనలు చేశారు అనంతరం 56వ జన్మదిన సందర్భంగా 56 మొక్కలను పంచిపెట్టారు. మరియు ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం పిల్లల ద్వారా పిల్లలతో కేక్ కటింగ్ చేయించి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు మరియు నాయకులు తో పాటు టిడిపి, బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.