ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పుకాపు వెల్ఫేర్ &డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమీతులైన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన టిడిపి మరియు బిజెపి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జి *గౌ.శ్రీమతి పాలవలస యశస్వి* గారికి ఈరోజు విజయనగరం జిల్లా ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మాన సభ జరిగింది ఈ సభలో ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ గారు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరము కష్టపడి ఎంతోమంది జనసైనికులకు భరోసానిచ్చి ఈరోజు రాష్ట్రస్థాయిలో కీలకమైన తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ అవ్వడం చాలా గర్వించాల్సిన విషయమని మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా కీలకమైన పదవులు వస్తాయని దానికి ఎంతో సహనంతో నిరంతరం పార్టీ కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మరియు కూటమి నాయకులకు తెలుపుతూ ముఖ్యంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులకు తన ధన్యవాదాలు తెలియజేశారు