అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సమాజంలో నిరుపేద గర్భిణులకు బాలింతలకు పిల్లలకు అనేక సేవలను అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడి ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశించిన సేవలను అందిస్తున్నామని గర్భిణులకు బాలింతలకు చిన్న పిల్లలకు రక్తహీనత కలక్కుండా ప్రభుత్వ సరఫరా చేసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవలు అందిస్తున్నామని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నామని అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉందని గత ప్రభుత్వంలో అంగన్వాడి ఉద్యోగులు సమ్మె చేస్తే కనీసం పట్టించుకోలేదని దానితో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు కోసం తమ వంతు కృషి చేశామని మా సమస్యలను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందిస్తారని మా అంగన్వాడి ఉద్యోగులకు వేతనాలు పెంచి ఆదుకోవాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ అంగన్వాడీ ఉద్యోగుల సంఘం సభ్యులు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రిగారి అయిన శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు బలగరాధ మరియు కార్యదర్శి జి సత్యవతి ,సిహెచ్ రమణమ్మ , వరలక్ష్మి అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది