ఆంధ్ర ప్రదేశ్ లో జూట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ జూట్ అసోసియేషన్ సభ్యులు కిమిడి నాగార్జున, TVS లింగమూర్తి, సునీల్ భారరియా, హర్ష నహత
ప్రతినిధులతో ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్ మోహన్ నాయుడు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి జూట్ పరిశ్రమను ఆదుకోవాలని అన్నారు. అతను సానుకూలంగా స్పందించి ఉత్తరాంధ్రలో పరిశ్రమలు బాగు కోసం తన బాధ్యతగా తీసుకుంటానని, సంబంధిత శాఖ మంత్రివర్యులతో మాట్లాడుతానని చెప్పటం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జూట్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.



