విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కాపుశంభాం లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని వరద బాధితులకు అందజేయనున్నారు. రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని వరద భీభత్సము తో అతలాకుతలమైన విజయవాడ వాసులకు జరిగిన నష్టాన్ని చూసి చలించి పోయిన చిన్నారులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాము కూడా వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని భావించి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రాము , ఉపాధ్యాయులు చల్లా సింహాచలం, కే గోపాలకృష్ణ, బి పావని , కే జనార్దన్ రావు కే మోహన్ కృష్ణ ,జి.వి శ్రీదేవి, పి ప్రకాష్ రావు,పి పార్వతి ఎం పద్మజ ఏ నిర్మలా కుమారి, పెద్ది శ్రీను, బుద్దగురు యోగ మిగతా ఉపాధ్యాయులు మరియు అంగన్వాడి సిబ్బంది రఘుమండ రూప తదితరులు పాల్గొనడం జరిగింది.విద్యార్థులందరు తాము దాచుకున్న పొదుపు డబ్బులునుండి కొంత మొత్తాన్ని ఇచ్చి తమ యొక్క ధాతృత్వం చాటుకున్నారు… అలాగే మేము సైతం…… అంటూ అంగన్ వాడి చిన్నారులు మరియు సిబ్బంది కూడా ఇందులో పాలుపంచుకొని సుమారు నాలుగువేల రూపాయలు నిధిని సమకూర్చితమ సేవా భావాన్ని తెలియజేసారు.