విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో లావేరు రోడ్డు లో శ్రీ వరసిద్దివినాయక సేవా సంఘo వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్ధివినాయక ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు,
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…
ఎడతెరపిన లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు.
మరో రెండు రోజులు పాటు బారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపద్యంలో ఏలాంటి పరిస్తితులైన ఎదుర్కోవడానికి ప్రభుత్వ అధికారయంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అలాగే విజయవాడలో అధిక వర్షాల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే బాధితులకు అండగా ఉండకుండా, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తే బారెడు ,చేతలు చూస్తే మూరెడు అన్నట్లుగా ఉన్నాయని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి తానే ఖర్చు పెడతాననడం విడ్డురంగా ఉందన్నారు.
75ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24*7 కష్టపడి ప్రజలకోస్రం ప్రజల మధ్య హహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి కి సహాయం చేయక అక్కడకూడ జగన్మోహన్ రెడ్డి దండు పాలెం బెచ్ పనికిమాలిన రాజకీయం చేస్తున్నారు అని కళాఎద్దవా చేశారు….
కూటమి ప్రభుత్వ కార్యకర్తలు వరద ముంపు బాధితులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాలని కళా పిలుపునిచ్చారు…..