ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా

ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా

చీపురుపల్లి పట్టణంలో ఈరోజు భవననిర్మాణ కార్మికులు ఉచిత ఇసుక విధానం అమలు కాకపోవడం మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీ కార్మికులకు సంఘీభావం తెలియజేసి మద్దతు పలికారు చీపురుపల్లి మండలం మరియు పట్టణంలో వున్న భవన నిర్మాణాకార్మికులు అందరితో కలిసి వంశీ విష్ణు జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ మరియు మూడు రోడ్డు ల జంక్షన్ వరకు పెద్దఎత్తున ర్యాలీ గా వెళ్ళి ఉచిత ఇసుక అందించండి కార్మికుల ఆకలికేకలు ఆలకించండి అని నినాదాలు చేసారు, ఈ సందర్బంగా వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలల కాలం అవుతుంది అని ఉచిత ఇసుక పేరుపెట్టి ఇసుక దొరకకుండా చేసారు అని భవన నిర్మాణ కార్మికులు గత 3 నెలలుగా పనులు లేక పస్తులు ఉంటున్న పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గారికి కార్మికుల ఆకలి కేకలు వినిపించడం లేదని వారి భాదలు కనిపించడంలేదని అన్నారు, ఈరోజు ఏ పార్టీలు పిలుపు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా కార్మికులు అందరూ ఏకమై వారి భాదలు ఆకలి కేకలు వినిపించడానికి రోడ్డు ఎక్కారు అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు ఇసుక విధానాన్ని సరళ్ళీకృతం చేసి మీరు అన్నట్టుగా ఉచిత ఇసుక అందించి భవన నిర్మాణ కార్మికులకు అందించక పొతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరించారు,భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్ లో ఎటువంటి పోరాటాలు చేసిన తప్పకుండ వైస్సార్ పార్టీ తరుపున మా నాయకులు అందరం అన్ని విధాలుగా మద్దతు తెలియజేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమం లో జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లానవంశీ, ఎంపీటీసీ కోరుకొండ దాలయ్య, గిరిడి రామదాసు, ముళ్ళు పైడిరాజు, స్కూల్ చైర్మన్ గవిడి సురేష్, కర్ణపు ఆది, కర్రోతు ప్రసాద్,సోషల్ మీడియా కన్వినర్ ప్రభాత్,డబ్బాడ ఆనంద్,వెంకీ అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘము ప్రెసిడెంట్ గవిడి శంకరావు,సెక్రటరీ రేగిడి అప్పలనాయుడు, వైస్ ప్రెసిడెంట్ బెల్లాన సత్యం,సప్ప లక్షిమునాయుడు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి