గిరిజన ప్రాంతంలో 100% ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే కల్పించాలని అల్లూరి జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం



ఈరోజు Nov-04, జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు_
శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు

ఈ సమీక్ష సమావేశంలో హాజరై గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు 100% గిరిజనులకే కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంచార్జీ మంత్రి గారికి అరకువేలి అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు
రేగం మత్స్యలింగం గారు
వినతి పత్రం అందజేసి, జీవో నెంబర్-03, కోర్టు కొట్టివేయడంతో గిరిజన ప్రాంతంలో గిరిజన యువతి, యువకులకు అన్యాయం జరుగుతున్నదని, నిరుద్యోగులు పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని జీవో నెంబర్-03 కి ప్రత్యామ్నాయ జీవో ప్రభుత్వం తేవాలని వివరించారు. మరియు గిరిజన ప్రాంతంలో MGNREGS నిధులు ప్రభుత్వం కేటాయించాకపోవటంపై తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా భౌగోళికంగా ఎక్కువ కావటంతో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కావున వాటిని గుర్తించి మైధన ప్రాంతం కన్న గిరిజన ప్రాంతంలో అదనంగా నిధులు కేటాయించాలని కోరుతూ వినతులు సమర్పించారు. మరియు అనంతగిరి మండలం పరిధిలో నాన్-షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో భూ ఆక్రమణ విపరీతంగా జరుగుతున్నదని వాటి వలన అక్కడి గిరిజనులు జీవనాధారం కొలిపోయే ప్రమాదం ఉందని మంత్రి గారికి విన్నవించి సమస్యల పరిష్కారం చెయ్యాలని కోరారు. మరియు నియోజకవర్గంలో పలువురు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి గిరిజనేతరులతో చేతులు కలిపి ఇష్ట రాజ్యాంగ భూములు ఆక్రమ రిషిస్ట్రేషన్స్ చేస్తూ, 1/70 చట్టం, పేసా చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారని వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, మరియు మన్యం గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, రోడ్డు మరియు మంచి నీరు సమస్యలను ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి సుదీర్ఘంగా వివరించారు._

ఈ కార్యక్రమంలో
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్_
శ్రీ దినేష్ కుమార్
_అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ_ అమిత్ బర్డర్
అరకు పార్లమెంట్ సభ్యురాలు_
_శ్రీమతి గుమ్మ తనూజ రాణి _
_ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఛైర్పర్సన్_
_*-శ్రీమతి జల్లిపల్లి సుభద్ర
_రంపచోడవరం అసెంబ్లీ శాసన సభ్యులు_
-శ్రీమతి శిరీషదేవి
_పాడేరు ITDA ప్రాజెక్ట్ అధికారి_
_*-శ్రీ అభిషేక్
_మరియు జిల్లా స్థాయి అధికారులు,_
_ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *