గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS

గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ IAS

*గిరిజన సంక్షేమ శాఖకు కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎం.ఎం. నాయక్ (IAS )గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.*

*ఈ సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నాయక్‌ కు స్వాగతం పలుకుతూ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. గిరిజన సముదాయాల అభివృద్ధికి తీసుకుంటున్న వివిధ చర్యలను ఆమె వివరించారు. ప్రత్యేకంగా, గిరిజన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టడం ముఖ్యమని మంత్రి అన్నారు

ఈ సందర్భంగా ఎం.ఎం. నాయక్ గిరిజన సంక్షేమానికి తన పూర్తి నిబద్ధతను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే దిశగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి