ఆ తెగ నుంచి తొలి డాక్టర్.. ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆదివాసీ బిడ్డ_
జనపాల – గోవిందరావు
ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్త
మనజనం
ఇంటర్‌నెట్ డెస్క్: అనుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు
మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి, పెరిగి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేశాడు.
ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలో అర్హత సాధించి, మంచి కాలేజీలో సీటు సాధించాడు.
ఒరిస్సా లోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి(19) ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
బరంపురం(బెర్హంపూర్)లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి(MKCG) మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు.
అంతేకాదు ఆ తెగ నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు.
ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొంది
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ ముదులి కుటుంబం చిన్నతరహా అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవిస్తోంది