గొప్ప మనస్సు ఉన్న మారాజు వలిరెడ్డి

గొప్ప మనస్సు ఉన్న మారాజు వలిరెడ్డి



చీపురుపల్లి మండలం, అలజంగి, మెట్టపల్లి, సంకుపాలెం వరకు యాక్సిడెంట్ జోన్ లో రోడ్డు కి ఇరువైపులా తుప్పలు, పిచ్చి మొక్కలు పూర్తిగా  రోడ్డు మీదకు వచ్చి రోడ్డు మలుపుల వద్ద రోడ్డు అసలు కనిపించక యాక్సిడెంట్ లు అవుతున్న పరిస్థితి అక్కడి ప్రజలు, యాత్ సభ్యులు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష శ్రీనివాసనాయుడు గారి ద్రుష్టి కి తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించి తన సొంత నిధులు తో జేసీబీ ఏర్పాటు చేసి రోడ్డు కి ఇరువైపులా ఉన్న పొదలు, మొక్కలు తొలగించడం అపని పర్యవేక్షణ చేస్తున్న జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు చీపురుపల్లి నుంచి సుభద్రపురం రోడ్డు లో అలజంగి నుంచి ముల్లుపేట మధ్యలో, అలాగే మెట్టపల్లి నుంచి సంకుపాలెం వరకు యాక్సిడెంట్ జోన్ మలుపుల వద్ద ప్రమాద సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అని, స్థానిక యువకులు నాయకులు మా ద్రుష్టి కి ఈ సమస్యను తీసుకుని వచ్చారు అని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది  అని చాలా మంది యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోవడం అలాగే వికలాంగులుగా అవుతున్నారు అని సమస్య తీవ్రత్త దృష్టిలో పెట్టుకొని ఆర్ అండ్ బి నిధులు ఇంత తొందరలో మంజూరు అయ్యే అవకాశం లేదు కనుక  ప్రజల కోసం సొంత డబ్బులు తో ఈ పని చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో వైస్సార్ పార్టీ నాయకులు జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,మెట్టపల్లి మాజీ సర్పంచ్ చందక శ్రీనివాసరావు, ఎంపీటీసీ మీసాల ఈశ్వరావు, రామలింగాపురం మాజీ సోసైటీ అధ్యక్షులు రేవల్ల సత్తిబాబు, కుమార్, రాము, ప్రభాత్, సత్యం, దుర్గారావు వెంకీ, సంతోష్ పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి