Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్

Posted on 09/06/2025

*ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!*

*ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు*

*రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం*

*కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!*

*జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి*

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్

పార్వతీపురం: ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ -2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభకనబర్చిన 26మందిని మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాం. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమే. మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది. రాబోయేరోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలి. మీ జూనియర్లకు గైడ్ చేయడం ద్వారా స్పూర్తినివ్వండి.

మీరు సాధించిన విజయాలు దేశానికి తెలియాలి

ఈరోజు మీరుసాధించిన విజయాలు భారతదేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గం. జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరూ దూరంచేయలేరు. మీరంతా కష్టపడి బాగా చదివారు. హ్యాట్రిక్ సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మీకు అద్భుతమైన ఫౌండేషన్ ఉంది. అవకాశాలను నిచ్చెనమెట్లుగా ఉపయోగించుకుని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

Spread the love

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme