తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలనలో తొలి అడుగు 4.1” కార్యక్రమం సాలూరు మున్సిపాలిటీ 2వ మరియు 5వ వార్డుల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
వైసీపీ నేతల అడ్డంకుల వల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎంతో అవసరమైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని విజయం చేయాలని ప్రజలు నిశ్చయించాలి. టీడీపీ అభ్యర్థి గెలిస్తే వెంటనే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను పునఃప్రారంభిస్తాం. సాలూరు పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా మంత్రివర్యులు స్వయంగా వినడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరిగి విశ్వాసం పెరిగినట్లు ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.
పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ప్రభుత్వం అందించే సేవలను ప్రజల దాకా చేర్చే సంకల్పం మరోసారి ప్రజల ఎదుట ప్రతిబింబితమైంది.










