విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి గారి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది
పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు అందించిన రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించిన మంత్రి సంధ్యారాణి
విద్యార్దులు వేసిన సాంస్కృతిక నృత్యాలు, యోగాసనాలను తిలకించిన మంత్రి సంధ్యారాణి
ఆడపిల్లలు ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెప్పిన విధంగా మగపిల్లలు కూడా బయటకు వెళ్లినప్పుడు మహిళల పట్ల సోదరి భావంతో వుండాలని, వారిని గౌరవించాలని జాగ్రత్తలు చెప్పాలని తల్లితండ్రులకు సూచించిన మంత్రి సంధ్యారాణి
బాల్యవివాహాలను అరికట్టాలని తల్లితండ్రులకు అవగాహన కల్పించిన మంత్రి సంధ్యారాణి
సెల్ ఫోన్లను అవసరమైన మేరకే ఉపయోగించాలని సెల్ ఫోన్లతో ఎంత ఉపయోగం వుందో అంతకంటే ఎక్కువగా చెడు ప్రభావం ఉంటుందని విద్యార్దులకు అవగాహన కల్పించిన మంత్రి సంధ్యారాణి
పాఠశాలలో పిల్లలకు అందించే ఆహార నాణ్యతను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి
భోజనం రుచికరంగా ఉండడంతో పాఠశాల సిబ్బందిని అభినందించిన మంత్రి సంధ్యారాణి
విద్యార్దులు చదువుతో పాటు ఆటలలో కూడా రాణించి ఉన్నత స్థానాలలో ఎదగాలని ఆశిస్సులు అందించిన మంత్రి సంధ్యారాణి
