రెడ్డి రమణ గారి లోటు పూడ్చ లేనిది
ప్రముఖ సమాజ సేవకుడు రెడ్డి రమణ మరణం పట్ల చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చీపురుపల్లి మండలం,జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఆశయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి రమణ గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకుని ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు
ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ..
సామాజిక సేవా కార్యక్రమంలో ఆయన పోషించిన పాత్ర వేల కట్టలేనిదని చీపురుపల్లి పరిసర ప్రాంతాల్లో మొబైల్ బైక్ లైబ్రరీ ద్వారా విద్యార్థులలో పుస్తకపఠనం పట్ల ఆసక్తి పెంపొదించడమే తన దినచర్యని కొనియాడారు.
అంతకు మించి కరోన వంటి విపత్కర సమయంలో ఆయన తీసుకున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ప్రజల మదిలో నిలిచి పోతాయని ఆయన చెప్పారు.
అటువంటి వ్యక్తి లేని లోటు పూడ్చ లేనిదన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మంచి మనిషి రెడ్డి రమణ గారు ఆయన మరణం చీపురుపల్లి పట్టణానికి తీరని లోటని అన్నారు
రెడ్డి రమణ గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపి కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





