విజయనగరం జిల్లా రేగిడి మండల పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు, ఈ విషయమై శుక్రవారం రేగిడి ఎస్సై లీలావతికు వినతి పత్రం అందించారు, ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కారణం బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగమే అని రఘురామకృష్ణం రాజు తెలుసుకోవాలని, అందరికీ ఓటు హక్కు కల్పించి ఉన్నతమైన పదవులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యానర్ను చింపినందుకు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని, కుల అహంకారంతో ఉన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణుని లక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అనే దళిత డాక్టర్ ని బూతులు తిట్టడం అన్యాయమైన దీనిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్పందించి దళితులు ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజాo నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి బొత్స బుద్ధుడు, రేగిడి మండల సమతా సైనిక్ దల్ అధ్యక్షుడు, తేగల మోహన్
కుప్పిలి శ్రీనివాసరావు రాజాం నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ లీగల్ అడ్వైజర్, బత్తిని శేఖర్, అశోక్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు