పార్వతీపురం : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం గాదెలవలస నుండి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం  టిడిపి నాయకులుతో  కలిసి గాదెలవలసలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజలకు పలు వరాలు కురిపించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు రోడ్లు లేకుండా పోయాయని ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని గ్రామాలకు తారు రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గాదెలవలస గ్రామానికి ఎన్నో సేవలు చేయాల్సిన అవసరం తనకు ఉందని, గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి ప్రోత్సహించిన ప్రజలను తీర్చుకుంటానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హామీ ఇచ్చారు.  ఏప్రిల్ నాటికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులకు తీసుకొస్తానని పేర్కొన్నారు. గాదెలవలస ప్రజలందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారని భవిష్యత్తులో ఈ గ్రామానికి ఎన్నికలు అవసరం ఉండకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి