జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రారంభించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి డాII బిII అంబేద్కర్ గురుకులం (గర్ల్స్) లో కర్లాం పిహెచ్సి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, రామలింగాపురం సర్పంచ్ ఇప్పిలి నారాయనమ్మ, ఎంపీడీవో కె. రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్ రాణి శ్రీ, కలం సిహెచ్ఓ బి. కమల కుమారి చేతులు మీదగా పంపిణీ చేసారు ఈ సందర్బంగా మాట్లాడుతూ నులిపురుగులు సక్రమంగా తగ్గించడానికి మనం పరిశుభ్రంగా ఉండాలన్నారు.
నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 1 -2 ఏండ్ల పిల్లలు 200 మిల్లీ గ్రాముల మాత్రలు, ఆపైబడిన వారు 400 మిల్లీ గ్రాముల మాత్రను వేసుకొని బాగా నమలాలి. కడుపులో నులి పురుగులు ఉంటే మాత్రలు వేసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. వీటిని ప్రతి ఆరునెలలకోసారి వేసుకోవడం వల్ల నులిపురుగులు తగ్గిపోతాయి. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, రామలింగాపురం సర్పంచ్ ఇప్పిలి నారాయనమ్మ, ఎంపీడీవో కె. రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్ రాణి శ్రీ, కలం సిహెచ్ఓ బి. కమల కుమారి, వార్డు మెంబర్ ఇప్పిలి కృష్ణ, ప్రభాత్ కుమార్, కర్లాం పిహెచ్ సిబ్బంది వి. శామ్యూల్, నాగచైతన్య, వినోద్, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు