పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు

పంచాయతీ సర్పంచ్ఆధ్వర్యంలో NRGS సిమెంట్ రోడ్డు,కాలువ పనులు
————————తేదీ 25/10/2024,శుక్రవారం, చీపురుపల్లి పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మెటీరియల్ కంపోనెంట్ వర్క్స్ లో భాగంగా పట్టణంలో జగన్నాధరాజుకాలనీవీధిలో లో సుమారు 10 (పది )లక్షలరూపాయలునిధులు తో మంజూరు అయిన సిమెంట్ కాలువ పనులను ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ,వైస్ఎంపీపీప్రతినిధిపతివాడరాజారావు ,సిమెంట్ కాలువ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్బంగా మాట్లాడుతూ సుమారు కోటి పదిహేను లక్షల రూపాయలు మెటీరియల్ కాంపౌనెంట్ (nrgs)నిధులు కేంద్రం చీపురుపల్లి మేజర్ పంచాయతీ కి మంజూరు చేసింది అని, ఈ పనులు సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు పూర్తి చేస్తాం అని అన్నారు, ఇవి కేంద్రం నేరుగా పంచాయతీ లకు కేటాయించిన నిధులు కావున, పంచాయతీ ఏకౌంట్ లో పనులు పూర్తి అయిన తరువాత బిల్లులు చెల్లింపులు జరుపుతామని తెలిపారు,చీపురుపల్లి మేజర్ పంచాయతీ లో గ్రామ సభ ద్వారా సుమారు 80 వరకు పనులు గుర్తించి గ్రామసభ ద్వారా పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించామని అయితే సుమారు 17 పనులు కోటి పదిహేను లక్షలరూపాయలు నిధులు మంజూరు అయ్యాయి అని పనులు పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ex జడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు,యువజననాయకులు బెల్లాన వంశీ, వైస్ ఎంపీపి ప్రతినిధి పతివాడరాజారావు, ఎంపీటీసీ లు కోరుకొండ దాలయ్య, గిరిడి రామదాసు, ముళ్ళు పైడిరాజు,వైస్సార్ పార్టీ నాయకులు గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, కర్ణపు ఆది, బలగ రమేష్, ప్రభాత్ కుమార్, పెద్ది కృష్ణ, పాలిశెట్టి ఈశ్వరావు,బాలాజీ హోటల్ పండు,నాగచైతన్య, వెంకీ, దన్నాన సత్యం,వార్డ్ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *