పౌష్టికాహార మాసోత్సవాలు*

పౌష్టికాహార మాసోత్సవాలు*



గరివిడి :  మండలం లో ఐతం వలస గ్రామం ,   బొండపల్లి  సెక్టార్ పరిధిలో ఉన్న  అంగన్వాడీ సెంటర్   లో  పోషకాహార మాసోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పౌష్టికాహార ప్రదర్శన చేసి  తల్లులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ ఎం జ్యోతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  పౌష్టికాహారం తీసుకోవడం వలన రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చని, గర్భిణీలు ప్రసవ  సమయంలో ఆరోగ్యకరంగా ఉంటారని, తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారని అన్నారు.   రక్తహీనత లేకుండా ఉంటే అనేక రకాల వ్యాధులు సోకకుండా ఉంటాయని తెలిపారు.  పిల్లలకు ఎటువంటి ఆహారము ఇవ్వాలో, బాలామృతంతో ఎటువంటి వంటలు చేసి పిల్లలకు పెట్టవచ్చొ తయారుచేసి చూపించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్   ఎమ్. జ్యోతి, అంగన్వాడీ కార్యకర్త  పైడమ్మ ,   గర్భిణీ, బాలింత లు తల్లుల పాల్గొన్నారు .

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి