రక్తదానంప్రాణదానం అని పట్టణ సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.శనివారం స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్, నవోదయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి రక్తం చాలా అవసరం ఉందని అలాంటి వారి కోసం ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే చాలా బాగుంటుందని అన్నారు.అలాగే యువతీ యువకులు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అలాగే యువత ఇలాంటి మంచి పనులను చేస్తూ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే లాగా తీర్చిదిద్దే లాగా ఉండాలి.అందుకోసం యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి మంచి మార్గాల్లో ప్రయాణిస్తే ఈ సమాజంలో మంచి ఆదర్శవంతులుగా ఉంటారని కొనియాడారు.అలాగే అసోసియేషన్ మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటివరకు 8 నిర్వహించడం జరిగింది.ప్రతి రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ రక్త నిధి సేకరణ చేయడంలో భాగస్వామ్యులు అయ్యారు.ఈ రక్తదాన శిబిరంలో రక్త నిధి 32 మంది స్వచ్ఛందంగా రక్తం సేకరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహాయ సహకారాలు అందించారు. ఈ రక్త నిధి విజయనగరం ఎన్వియన్ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలోటిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు,కూనిశెట్టి బీమా,అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్,గౌడ్ ఈశ్వరరావు, వి.చంటి,ఆర్ జయప్రకాష్,కె వినయ్, వసంత కుమార్,