గరివిడిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ-బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరో యువకుడి పరిస్థితి విషమం. గరివిడి-గరివిడిలో ఫేకర్ పరిశ్రమ సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కోండ్రు కరుణ(26) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మరో యువకుడు కింతాడ రేవంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఈ విధంగా వన్నాయి. డి.ఎఫ్.ఎన్ కాలనీకి చెందిన కరుణ, రేవంత్, నూకరాజు ముగ్గురూ బైక్ మీద వెడుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కోండ్రు కరుణ మృత్యువాత పడ్డాడు.ఇదే బైక్ పై ఉన్న రేవంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.మరో యువకుడు నూకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఈ ప్రమాదంతో డీ.ఎఫ్.ఎన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గరివిడి ఎస్.ఐ. దామోదర రావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.