అవయవ దానం ఎంతోమందికి ప్రాణదానం అని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరీర అవయవ దానం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీమరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ముఖ్యఅతిథిగా గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరంనం అవయవ దానం చేయడం చాలా మంచి పరిణామం అని కొనియాడారు. అలాగే మీకై..మేము సంస్థ వారు పట్టణంలో రక్తదానం అన్నదానం,దేశ నాయకులు విగ్రహాల ఆవిష్కరణ, నిత్యవసరుకులు అందించడం,ఆర్థిక సహాయం,వేసవికాలంలో చలివేంద్రాలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు. చనిపోయిన వ్యక్తి అవయవ దానం చేయడం ఎంతోమందికి కళ్ళు హాట్ కిడ్నీ లివర్ ఇటువంటి ముఖ్యమైన అవయాలు వారికిి అందించడం ప్రాణాలు బ్రతికించడం ఒక గొప్ప వరం అని తెలిపారు. అలాగే యువతి యువకులు చదువుకుని గొప్ప గొప్ప ఆశయాలను సాధించాలని చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గం వైపు నడుచుకోవాలని విద్యార్థులకు దిశా నిర్దేశాన్ని చేశారు.డాక్టర్ వాడాడ గణేశ్వరరావు,పెంట శ్రీనివాసరావు అవయ దానంపై అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో మీకై..మేము సభ్యులు ఇప్పిలి దిలీప్ కుమార్, ఈశ్వరరావు, మహేష్, టిడిపి కార్యకర్తలు, నాయకులు, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..