ఈ రోజు ఉదయం 00.00 hr నుంచి పాత చట్టాలైన IPC, Cr. Pc & IEA లు రద్దు కాబడి కొత్త చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సాలూరు పట్టణ సీఐ సిహెచ్ వాసు నాయుడు మరియు వారి సిబ్బంది స్థానిక డిగ్రీ కళాశాలలోనూ మరియు బాలికల ఉన్నత పాఠశాలలో ను కొత్త చట్టాల అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. . కొత్త చట్టాలకు సంబంధించి అవగాహన కోసం కొన్ని ప్రతులను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది.
ఈరోజునుంచి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రధాన చట్టాల వర్గంలోకి వస్తాయి అని
ఈ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (గతంలో IPC), భారతీయ నాగరిక్ సురక్షగా పునర్నిర్మించబడ్డాయి అని
సంహిత (గతంలో Cr.P.C.) మరియు భారతీయ సాక్ష్యా అధినియం (గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్). వలసవాద యుగం చట్టాలను భర్తీ చేయడం ద్వారా భారత నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించడం తిరిగి అమలులోకి తీసుకురావడం యొక్క ఉద్దేశ్యం. తిరిగి అమలు చేయబడిన చట్టాలు బాధితుల కేంద్రంగా మరియు కొత్త సాంకేతిక యుగానికి మరింత అనుకూలమైనవిగా పేర్కొనబడ్డాయి. అవి సమాజం మరియు జాతీయ భద్రత యొక్క ప్రస్తుత అవసరాలకు బాగా సరిపోతాయని కూడా పేర్కొనబడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లెక్చరర్స్ మరియు స్థానిక పెద్దలు హాజరు కావడం జరిగినది.