మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన కంటా రమేష్(34) s/o లేటు జగన్నాథం ఈనెల 23వ తేదీన ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం జరిగింది. అయితే నాటినుండి… ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాకు సమాచారం అందించడం జరిగింది. ఈరోజు అనగా 28/7/2024 తేదీన ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం ఈతమానవలస గ్రామం సమీపంలో రమేష్ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచినామా నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.