ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గిరిజన జేఏసీ సంఘాల నాయకులు వినతిపత్రం

పార్వతీపురం ఆదివాసీ JAC ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి. ప్రధాన గిరిజన సమస్యలు అయినటువంటి జీవో నెంబర్ 3, షెడ్యూల్ ఏరియా, స్పెషల్ డిఎస్సి గురించి చర్చించడం జరిగింది

ఈ విషయాలు గురించి సంధ్యారాణి  స్పందిస్తూ జీవో నెంబర్ 3 ని స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు తీసుకువచ్చారని, దాన్ని రద్దు చేయడం వల్ల చాలామంది గిరిజనులు నష్టపోయారని. జీవో నెంబర్ 3 స్థానంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఒక కొత్త జీవో ని తీసుకొని రావడానికి మంత్రి గారితో మాట్లాడమని కచ్చితంగా కొన్ని రోజులలో కొత్త జీవోను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. డీఎస్సీ 2024 లో మొత్తం 16450 పోస్టులలో ఎస్టీలకు 2000 పోస్టులు కేటాయించడం జరిగిందని అందులో అరుకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఐటిడిఎల్లో మొత్తం 1100 పోస్టులు గిరిజనులకు ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం 1100 పోస్టులను కూడా గిరిజనులతో భర్తీ చేస్తామని మాట ఇచ్చారు. అలాగే గిరిజన జేఏసీ స్పెషల్ డిఎస్సి గురించి కోరగా, దాని గురించి కూడా ప్రభుత్వంతో మాట్లాడి స్పెషల్ డిఎస్సి నిర్వహించే దిశగా కృషి చేస్తామని చెప్పారు.

షెడ్యూల్ ఏరియా విషయం గురించి మాట్లాడుతూ ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి ఇది పరిష్కరించేందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి గిరిజనులంతా కాస్త ఓర్పుతో ఉంటే ఆ సమస్యను కూడా తీర్చే దిశగా అడుగులు వేస్తామని చెప్పి మాటిచ్చారు.

అలాగే కొన్ని ప్రాథమిక సమస్యలు అయినటువంటి రోడ్లు, పాఠశాలలు, మంచినీటి సదుపాయాల గురించి కూడా మాట్లాడ్డం జరిగింది. ఇందులో ఆదివాసి జేఏసీ వైస్ చైర్మన్ కొండగొర్రి ఉదయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ దుక్క సీతారాం, వైస్ చైర్మన్ మజ్జి నారాయణరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిమ్మక అన్నారావు, పల్లా సురేష్, మువ్వల విజయ్, కొండగొర్రి సూర్యారావు, రాయల అరవింద్, గిరిజ, కొండ గొర్రె కృపారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *