పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాలూరు పట్టణం నందు అమరులైన పోలీసులను గుర్తు చేస్తూ విద్యార్థులుతో నినాదాలు చేయించడం జరిగింది.పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అలాగే చెక్ పోస్ట్ లను పటిష్టం చేసే క్రమంలో సాలూరు రూరల్, పట్టణ సిఐలు రామకృష్ణ, అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాచిపెంట మండలం పి.కోన వలస చెక్పోస్ట్ వద్ద తర్ఫీదు పొందిన డాగ్స్ డ్రోన్ కెమెరాలతో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై కేవీ సురేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.