పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై పట్టు కోసం సతవిధాల ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక బలగాలని ఏర్పాటు చేసి ఆంధ్రాకు చెందిన అధికారులు కానీ నాయకులు గాని రానివ్వకుండా ఆ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటూ వాళ్ళ పెత్తనాన్ని నిరూపించుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కోటియా గ్రామాల్లో మైనింగ్ నిక్షేపాలు ఉండడంతో అక్కడ అధికారులు ఆ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులను బెదిరించి వాళ్ళ వ్యవసాయ భూములు లాక్కొని అక్కడ మైనింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళ నివాసాలకు వ్యవసాయానికి అడ్డుగా నిలుస్తున్నారని గతంలో గిరిజన సంఘాలు ధర్నాలు నిరాహార దీక్షలు చేసినా వాళ్లలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఇది ఎలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల
నేపద్యం అధికారుల దూకుడు ఇంకొంచం ఎక్కువ చేశారు. అక్కడ గిరిజనులను ఆకర్షించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒరిస్సా ఎన్నికల అధికారులు నిన్న కొరియా గ్రామంలో పర్యటించి అధికారులతో కొరియా గ్రామాలను సందర్శించి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విస్యని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడుతూ ఈ సమయం లో సరిహద్దు గ్రామాల్లో సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ ఐటీడీఏ పీవో ల మీద ఉందని ఒరిస్సా అధికారులు చేస్తున్న దౌర్జన్యాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు లో కేసు పెట్టే అధికారం వీలకే ఉందని ఎన్నికల సమయంలో నాయకులు చేతిలో ఏమీ ఉండదని అధికారులు ఈ సమస్యను చర్యలు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళ్తే ఒడిస్సా అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని తెలిపారు