పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు నియోజకవర్గం లో
మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ
ఒకటవ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3000 పెన్షన్ 4000 చేసినట్టు ఈ పెన్షన్ ని సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ఇస్తారని వికలాంగులకి 3000 నుంచి 6000 రూపాయలు పెన్షన్ పంపి చేస్తునట్టు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గతంలో టిడిపి ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఉండే పెన్షన్ ఇప్పుడు టిడిపి ప్రభుత్వం పదివేల రూపాయలు చేశారని ఈ ఘనత మన సిఎం చంద్రబాబు నాయుడు దే అని అలాగే పూర్తిగా బెడ్ మీద ఉండేవారికి గతంలో 5000 ఇచ్చేవారని ఇప్పుడు టిడిపి ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తారని, గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం వీళ్ళ కోసం పట్టించుకోకుండా వదిలేసిందని కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీళ్ళ గురించి ఆలోచించి ఈ పెన్షన్లను పెంపు చేశారని పత్రిక ముఖంగా తెలిపారు.