మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్
ఇటీవలే గుండెపోటుతో ఆర్ఎంపీ డాక్టర్ కాలం చెందారు.వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం, బంగారమ్మ పేట చెందిన టేకి పోలాచారి ఆర్ఎంపీ డాక్టర్ గా ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నారు.ఈయన ఏ అర్ధరాత్రి పిలిచినా వచ్చి సకాలంలో వైద్యాన్ని అందిస్తారు.వైద్య వృత్తిలోనే కాదు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు అని ప్రజలు,డాక్టర్స్ కొనియాడారు.టేకి పోలా చారి చిన్న కుమారుడు సూర్య చదువుతూ మీకై..మేము స్వచ్ఛంద సంస్థలో కరోనా సమయం నుంచి నేటి వరకు పలు విధాలుగా సంస్థకు, ప్రజలకు, సేవ చేశారు.మేము ఇతరులకే కాకుండా వారి సభ్యులకు కూడా అండదండగా నిలబడతారు అన్నారు.అలాగే మరిన్ని స్వచ్ఛంద సంస్థలు,వారి తోటి వైద్యులు అందరూ వారికి ఆర్థికంగా సహాయ పడాలని ఆ సంస్థ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలో మీకై..మేము బృందం గౌడ్ ఈశ్వరరావు,వి.చంటి, నాయుడు,మహేష్ పాల్గొన్నారు.