మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత



వై సీ పీ పాలన లో సీఎం చంద్రబాబు ని  ఎన్ని అవమానాల కు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత  అన్నారు.

రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని  ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు.

జైలు పరిసరాలను గమనించారు. ఈ సందర్భంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడాన్ని అనిత గుర్తు చేసుకున్నారు. లోపల కలియదిరిగిన ఆమె స్నేహ బ్లాక్ చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. మాజీ సీఎం జగన్ సర్కార్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైళ్లోని స్నేహ బ్లాక్‌లో ఉంచారు. స్నేహ బ్లాక్‌లో వసతులను చూసి అనిత చలించిపోయారు. వైసీపీ కక్ష సాధింపు రోజులు గుర్తుకువచ్చి బాధపడ్డారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి