పంట పొలాలకు దారులు కల్పించాలి

పంట పొలాలకు దారులు కల్పించాలి

పంట పొలాలకు     తోవలు కల్పించాలని.      రైతులు రాకపోకలకు సర్వేస్ రోడ్డు వేయాలని       వేసిన సైడ్ వాళ్ళను తొలగించాలని కోరుతూ రైతులు  నేషనల్ హైవే సమీపంలో ఉన్న.  రహదారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.       నిరసన కార్యక్రమంలో ముందుగా నౌలుగు నర్సింగరావు రాపాక అప్పారావు.       సర్పంచ్ ఇజ్జడ అప్పలనాయుడు    జడ్పిటిసి  మాజీప్రతినిధి సలాది అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగింది.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ.     నేషనల్ హైవే అధికారులు.       చిన్న చిన్న నిబంధనలకు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సైడ్ వాళ్ల నిర్మాణం చేపట్టే రైతులను పంట పొలాలకు వెళ్ళనీయకుండా తోవలు లేకుండా చేయడం దుర్మార్గమని.        ఇప్పటికైనా పంట పొలాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేసిన సైడ్ వాళ్ళను తొలగించి సర్వీస్ రోడ్ వెయ్యాలని వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని సేవలో మునిగిపోయి రైతులు సమస్యలు విస్మరించాయని దాదాపు హైవే పక్కన ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి అన్నం పెట్టే రైతును అన్ని విధాల ఆదుకునే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు సమస్త పరిష్కారం కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదని రైతులంతా సంఘటనంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.       ఈ కార్యక్రమంలో.       రైతు ప్రతినిధులు ఇజ్జాడ శ్రీనివాసరావు సలాది నరసింహులు.      మరియు రైతులతో పాటు సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి