మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా..మృగాలా చేయకూడని తప్పులు చేస్తున్నారు.. కాలగర్భంలో కలిసిపోతారుమహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉందిYCP ని, సాక్షి చానల్ ను మూసేసే సమయం దగ్గర పడిందిఅమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక జర్నలిస్టు, మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం..ఆడపడుచులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోనే తన్ని చొక్కా పట్టుకుని బయటకు లాగి పోలీసులకు అప్పగించాల్సింది పోయి జగన్ వెనకేసుకు రావడం దారుణం.. సీరియస్ గా రియాక్ట్ కావల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు వ్యంగ్యంగా నవ్వుతాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని ప్రవర్తన హేయమైన చర్య కొమ్మినేనిని అరెస్ట్ చేయడం తప్పు, గవర్నమెంటు పొరపాటు చేసిందని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది… అక్కచెళ్లెళ్ల ఓట్లతో ఐదేళ్లు సీఎం పదవిలో వెలగబెట్టి ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తారా?? అవమానిస్తారా?వైసీపీకి వచ్చిన 40 శాతం ఓట్లలో మహిళలవి లేవా?అమరావతి ఆడపడుచుల్లో ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేయలేదని భావిస్తున్నారా?సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని వ్యాఖ్యానించడం మరింత దురదృష్టకరం.. తల్లులు, అక్కచెళ్లెళ్ల గురించి ఇంత హీనంగా మాట్లాడటానికి వైసీపీ నేతలకు మనస్సు ఎలా వస్తుందోసీఎంగా, కేబినెట్ ర్యాంకులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం సమాజంలో ఎలా తలెత్తి తిరగాలనుకుంటున్నారో అర్థం కావడం లేదునేను ఒక టీడీపీ ప్రజాప్రతినిధిగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు.. ఒక మహిళగా బాధ్యతతో, బాధపడుతూ స్పందిస్తున్నానువైసీపీ నాయకుల తీరు చాలా హీనం.. సహించరాని విషయం… సమాజంలో చేయకూడని తప్పులు చేసేశారు మనుషులుగా మాట్లాడుతున్నారో…మృగాలుగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు..వైసీపీ నేతల తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నానుఅమరావతి ఆడబిడ్డలపై జుగుప్సాకర వ్యాఖ్యలు వైసిపి పతనానికి పరాకాష్టవైసీపీని, సాక్షి మీడియాను మూసేసే రోజులు దగ్గర పడ్డాయివైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి చీకట్లోకి తొక్కినా ఆ పార్టీ నేతల తీరు మారలేదు..వైసీపీ నాయకులకు మహిళలంటే మొదటి నుంచి చిన్న చూపే. మహిళల్ని వైసీపీ నాయకులు కించపర్చేలా మాట్లాడుతుంటే నాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఖండించకపోగా సమర్ధించారు. ఇప్పుడు మీడియాలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వారిని వెనకేసుకొస్తారా ? నాడు అమరావతితో పెట్టుకునే వైసీపీ అందఃపాతాళానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమరావతి ఆడబిడ్డలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వైసిపి పతనానికి పరాకాష్ట. వైసీపీని, సాక్షి మీడియాను మూసేసే రోజులు దగ్గర పడ్డాయి. వైసీపీ నేతల తీరును యావత్ సభ్య సమాజం చీత్కరిస్తోంది. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు జగన్, సజ్జల, సాక్షి యాజమాన్యంబేసరతుగా క్షమాపణలు చెప్పాలి.. Spread the love టపా నావిగేషన్ 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి లైన్స్ క్లబ్ స్కూల్ లో పుస్తకాల అమ్మకం ఆపాలి.ఎస్ఎఫ్ఐ డిమాండ్