పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సాలూరు మున్సిపల్ ఛైర్మన్
వైస్ ఛైర్‌పర్సన్ ఎంపికపై కీలక చర్చ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్‌ను విశాఖపట్నంలో సాలూరు మున్సిపల్ ఛైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని గెలుచుకున్నందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం సాలూరు మున్సిపాలిటీలో వైస్ ఛైర్‌పర్సన్ ఎంపికకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య సవివరంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు.
ఈ భేటీ సాలూరు మున్సిపాలిటీలో తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
— THE 9NEWS తెలుగు





