అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ మరో రెండు రోజుల్లో రానున్న నేపద్యంలో శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆవు పాలను కుండలో పొంగించి దానిలో కొత్త బియ్యము,కొత్త బెల్లం వేసి పొంగలి తయారు చేయడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం విద్యార్థులకు,ఉపాధ్యాయులకు రంగవల్లికలు,గొబ్బెమ్మలు,ఆటల పోటీలు నిర్వహించారు.మరియు సంక్రాంతి శోభ తెచ్చేలా హరిదాసుల వేషధారణ,ఎడ్లబండి అలంకరణ,గంగిరెద్దుల ఆటపాటలు,సాంస్కతిక నత్యాలు,భోగిమంట వేయడంతో పాటు మన సంస్కృతి ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి నిర్వహించిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు నిర్వహించి విద్యార్థులు,ఉపాధ్యాయులు మన సంస్కృతిని మర్చిపోకుండా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలాగే మకర సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను వివరించారు.ప్రముఖంగా దేశానికి వెన్నెముకైనా రైతు పొలంలో పండించిన పంట ఇంటికి తెచ్చే సందర్భంగా ఈ పండుగను గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహిస్తారని తెలిపారు.అందరూ సుఖశాంతులతో బాగా భాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.వివిధ ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులను ప్రిన్సిపాల్ గారు చేతులు మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి