పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు, తాడేపల్లిగూడెం, ఇచ్చాపురం, తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్కు డిఇ శ్రీరామమూర్తి మేనేజర్ రాఘవాచార్యులు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.