అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు సాలూరులోని GHH School మరియు Jyothirao Phule School లలో బాలికల కోసం స్వీయరక్షణ (Self Defence) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బాలికలకు ప్రాథమిక స్వీయరక్షణ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తత, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం గురించి అవగాహన కల్పించబడింది. మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన రక్షణలు మరియు పోలీస్ సహాయంపై కూడా వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ భద్రతపై మరింత అవగాహనతో పాటు ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి