శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపు




లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
సాలూరు గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో మే 18, 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా, సంప్రదాయ పద్ధతిలో సిరిమాను చెట్టు ఊరేగింపును ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, “శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగలో భాగంగా సిరిమాను చెట్టు ఊరేగింపు అనేది ఎంతో ఘనంగా, వైభవంగా, భక్తిశ్రద్ధలతో, సంప్రదాయంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ ఉత్సవం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచేలా ఉంటుంది” అని మంత్రి సంధ్యారాణి గారు పేర్కొన్నారు.
సిరిమాను చెట్టు ఊరేగింపు రూట్ మ్యాప్
సాలూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుండి ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి, శివాజీ బొమ్మ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మామిడిపల్లి జంక్షన్, డబ్బివీధి K.H. స్కూలు, డబ్బివీధి రామమందిరం, పెదకోమటి పేట, కోటవీధి దుర్గమ్మ గుడి, శ్రీ వేంకటేశ్వర డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, గొల్లవీధి, బోసుబొమ్మ సెంటర్, శివాజీ బొమ్మ జంక్షన్, నాయుడువీధి రామమందిరం వరకు కొనసాగుతుంది.
