ప్రజలు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని గర్వంగా చెప్పగలను అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.నా రెండు శాఖలకు కేటాయించిన నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ST సంక్షేమానికి రూ.9,190 కోట్లు మహిళా సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించటం పై ఆనందం వ్యక్తం చేశారు.
ఇది సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన సమతుల్యమైన ఆర్థిక ప్రణాళికగా నిలిచిందని ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనయమని వ్యవసాయ రంగానికి మద్దతుగా సబ్సిడీలు, సాగు నీటి ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికతల ను అందించేందుకు చేసిన ప్రకటనలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని రైతు బలపడితే దేశం బలపడుతుంది అన్న సూత్రాన్ని ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుదని అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం గొప్ప నిర్ణయమని ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను సడలింపలు కల్పించడం వలన కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయి. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు.
విద్య మరియు ఆరోగ్య రంగాలకు అధిక కేటాయింపులు చేయడం కూడా ఈ బడ్జెట్ ప్రత్యేకత.పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించడం వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని,
మహిళల సాధికారతకు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని పెంపొందించే లా ఉండటం మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని ,మొత్తం మీద ఈ బడ్జెట్ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రగతి శీలమైన ప్రణాళికగా కనిపిస్తుందని. ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ బడ్జెట్ నిజంగా చాలా బాగుందని ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని మంత్రి సంధ్యారాణి అన్నారు

