శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పట్టాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని ఆహ్వానించిన గడివలస గ్రామస్తులు.*                                                       సాలూరు నియోజకవర్గం, *పాచిపెంట మండలం, పాచిపెంట పంచాయతీ, గడివలస* గ్రామంలో వచ్చేనెల అనగా మార్చి నెల *తే.04/03/2026దీ నుండి 06/03/2026* వరకు మూడు రోజులు పాటు జరగబోయే నూతనంగా నిర్మించబడిన *శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి* వారి *విగ్రహప్రతిష్ట మహోత్సవము* లకు *ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గిరిజన శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారిని ఈరోజు సాలూరు పట్టణంలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన కార్డు అందజేశారు.ఈ సందర్బంగా స్వామి వారి ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి తప్పకుండా హాజరై స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారిని గడివలస గ్రామస్తులు కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి