సునీత రెడ్డి విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*పోలీసు సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ*విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ బ్యారక్స్ నందు నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లుగా జిల్లా *ఎస్పీ ఎ.ఆర్.దామోదర్* గారు జూన్ 8న తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు తమ విద్యార్హతలతోపాటు, ఖచ్చితంగా ఆంగ్లంలో భోదన చేయగలిగిన సామర్థ్యం ఉండాలన్నారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.1. పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేయుటకు – *ఖాళీ – 01**పి.జి.తోపాటు బి.ఈడి. విద్యార్హత, 5 సం.ల బోధన అనుభవం కలిగి ఉండాలి.*2. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు సోషల్ సబ్జెక్టును భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం – *ఖాళీ – 01**6 నుండి 10వ తరగతి విద్యార్ధులకు సోషల్ సబ్జెక్టును భోదించగలిగి, బి.ఎ. లేదా పి.జి.తోపాటు బి.ఈడి. విద్యార్హత కలిగి ఉండాలి.*3. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం – *ఖాళీ – 01**ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సబ్జెక్టును భోదించగలిగి, డి.ఈడి. విద్యార్హత కలిగి ఉండాలి.*4. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం – *ఖాళీ – 01**ఏదైనా కంప్యూటర్ కోర్సులో ప్రావీణ్యం ఉండి ఇదివరకు ఏదైనా స్కూలు నందు బోధన అనుభవం కలిగి ఉండాలి.*5. స్కావంజర్ ఉద్యోగం – *ఖాళీ – 01*పైన తెలిపిన ఉద్యోగాల భర్తీ కొరకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు *జూన్ 12వ తేదిన ఉదయం 10 గంటలకు* విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్సు సమీపంలోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాల నందు నిర్వహించే ఇంటర్వ్యూ మరియు డెమో క్లాసులకు సంబంధిత విద్యార్హత పత్రాలతో నేరుగా హాజరుకావచ్చునన్నారు. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల నివృత్తి కోసం సంప్రదించవలసిన ఫోను నంబర్లు *6305883484* లేదా రిజర్వు ఇన్స్పెక్టరు (అడ్మిన్) ఫోను నంబరు *9121109485* లేదా వెల్ఫేర్ ఆర్.ఎస్.ఐ. ఫోను నంబరు *9121109484* సంప్రదించ వచ్చునని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. Spread the love టపా నావిగేషన్ అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు భాద్యత వహించాలి