సునీత రెడ్డి విజయనగరం

విజయనగరం, జూన్ 10:

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా భారతదేశానికి ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని చెప్పారు.

జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా మాస్టర్లు, దేవస్థాన ప్రతినిధులు, భక్తులు మరియు యువత పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి