విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన




>విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చీపురుపల్లిలో విద్యార్థుల ఆందోళన
>బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల మానవహారం
>సమస్యల పరిష్కారం కోసం జరగబోయే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయండి


చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చీపురుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకీ మాట్లాడుతూ గత రెండేళ్లుగా స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ ఉండిపోయాయని, గత ప్రభుత్వం గానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గానీ ఈ స్కాలర్షిప్ విడుదల చేసే విధంగా కృషి చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులు మరియు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారనీ , స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్నాయని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 6800 కోట్ల స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ జాయిన్ అయితే జీవో నెంబర్ 77 పేరుతో వారికి రావలసిన స్కాలర్షిప్స్ లను ఆపేసారని , ఇప్పటికే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని ఆ హామీ నిలబెట్టుకునే విధంగా ఆ GO రద్దుచేసి పీజీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థని కార్పోరేటీకరణ కాషాయీకరణ కేంద్రీకరణ చేసే నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న బీసీ అమ్మాయిల హాస్టల్ లో వాటర్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్  కాస్మెటిక్ ఛార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చిన సర్కిల్ 30/67/2025 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిందని , ప్రభుత్వం ఏ విధంగా హక్కును ఈ సర్కులర్తో కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విద్యార్థి సంఘాల ద్వారానే రాజకీయాల్లోకి అడుగు పెట్టారని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇవే కాకుండా పలు విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 25న విజయనగరంలో జరగబోయే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం చేయని యెడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అందరినీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులంతా సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేస్తూ బస్టాండ్  వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం చీపురుపల్లి MRO గారికీ వినతిపత్రం అందజేయ్యడం జారిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు భారతి ,నాని మరియు చీపురుపల్లి మండలం కమిటీ సభ్యులు తేజ, శ్రీలత, మధులత, జగదీష్ మరియు తదుతరలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి