నాలుగు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి (వలి రెడ్డి శ్రీనివాస నాయుడు)

నాలుగు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి (వలి రెడ్డి శ్రీనివాస నాయుడు)



చీపురుపల్లి మండలం,  అలజంగి పంచాయతీ, విశ్వనాధపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల పూర్తిగా శిధిలావస్థతతకు చేరుకున్న విషయం గ్రామంలో ఉన్న వైస్సార్ పార్టీ నాయకులు, యువకులు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు దృష్టికి తీసుకొని వెళ్లగా ఈ సమస్యను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి ద్రుష్టి కి తీసుకొని వెళ్లి స్కూల్ బిల్డింగ్ కోసం జిల్లాపరిషత్ నిధులు నుండి సుమారు 10 లక్షలు రూపాయలు మంజూరు చేసారు, అయితే నిధులు మంజూరు చేసినప్పటికి గుత్తేదారు పని ప్ర్రారంభించని విషయం తెలుసుకొని జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఈరోజు విశ్వనాధపురం వెళ్ళి అక్కడ స్కూల్ పిల్లలు బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారు అని స్కూల్ బిల్డింగ్ పనులు వేగంగా పూర్తి చెయ్యాలని, 4 నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పాలని గుత్తెదారులకి అలాగే ఇంజనీరింగ్ అధికారులుకి తెలియజేసారు, ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ సొసైటీ అధ్యక్షులు రేవల్ల సత్తిబాబు, ప్రభాత్ కుమార్, తిరుపతి, రేవల్ల సత్యం, వెంకీ పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి