గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన గౌరవ చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు.కొత్త సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే 31వ తేదీనే పింఛన్లను పంపిణీ చేస్తుందని లబ్ధిదారులకు తెలిపిన ఎమ్మెల్యే కళావెంకటరావు గారు
ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ..
జనవరి 1వ తేదీ నూతన సంవత్సర సందర్భంగా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయడం..ప్రజా సంక్షేమంలో టిడిపి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
చీపురుపల్లి నియోజకవర్గం,గుర్ల మండలం పెనుబర్తి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీని ఉత్సాహంగా ప్రారంభించడం జరిగిందన్నారు.
గ్రామగ్రామాన పండుగలా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన టిడిపి, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం స్థానిక టిడిపి కూటమి నాయకులతో కలిసి నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.





