1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది

1/70 చట్టాన్ని కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తుంది

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.

275 జీవో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తీసుకొచ్చినది.

కాలక్రమేణా జీవో నంబర్ 3 కోర్టులో పలుమార్లు కొట్టివేయబడింది.


1/70 చట్టాన్ని తెదేపా ప్రభుత్వం పరిరక్షిస్తుంది.

ముఖ్యమంత్రితో మాట్లాడితే స్వయంగా ఆయనే సందేశం ఇచ్చారు.
అరకు, పాడేరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా వాయిదా పడేలా వైసీపీ నాయకులు కుట్రపన్నారు.
అమాయక గిరిజనులను రెచ్చగొట్టి తమ స్వార్థ ప్రయోజనాలను కొనసాగిస్తున్నారు.
గతంలో 7 ఎస్టీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే గిరిజనులను రెచ్చగొడుతున్నారు.
18 గిరిజన పథకాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రస్తుతం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి ఖాతాలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.*

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ₹2500 కోట్లతో 2000 గిరిశిఖర గ్రామాలకు రహదారుల కల్పన, కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు, గిరిజన అభివృద్ధి & సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

కాఫీ తోటల అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి, గంజాయి సాగును అరికడుతున్నాం.

గడచిన ఐదేళ్లు, ఎనిమిది నెలల్లో గంజాయి పట్టివేతలో ఎంత పురోగతి సాధించామో పరిశీలించండి.

కోఠియా గ్రామాల స్టేటస్‌కో అమలులో ఉంది.

గడచిన ఐదేళ్లలో ఒడిశా ఆగడాలు పెరిగాయి.

జగన్మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే ఒడిశా దూకుడు పెరిగింది.

5 పంచాయతీలు, 21 గ్రామాలుగా ఉన్న కొఠియా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి