మళ్లీ ప్రభళిల్లుతున్న డయేరియా భూతం
* పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* చాప కింద నీరుల డయేరియా భూతం
చీపురుపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండురోజుల నుండి డయేరియా బాధితులు చేరుతూ చికిత్స పొందుతున్నారు డయేరియా బారిన పడిన రోగులకు తక్షణమే చికిత్స ప్రారంభించామని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సాయి కిరణ్ కుమార్ అన్నారు గుర్ల మండలం నుండి అయిదు కేసులు గరివిడి మండలం నుండి రెండు కేసులు చీపురుపల్లి రెండు కేసులు నమోదు అయినట్టు సాయికిరణ్ కుమార్ తెలియజేశారు అందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించామని అతని పరిస్థితి కూడా నిలకడగానే ఉందని తెలియజేశారు ఇద్దరూ డయేరియా పేషెంట్లు చికిత్స అనంతరం కొల్ కోవడం జరిగిందని వారిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ వర్షాలు కారణంగా డయేరియా వెదజల్లే అవకాశం ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలును శుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటిని ప్రతి ఒక్కరూ త్రాగాలని ఆయన సూచించారు