రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఫిబ్రవరి 28న పెన్షనలు పంపిణీ మరియు చీపురుపల్లి సి.హెచ్.సి.లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లును ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులతో విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ఫిబ్రవరి 27న పర్యవేక్షించి, అధికారులకు భద్రతపరమైన సూచనలు చేసారు. అనంతరం, సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగు స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగు స్థలాలు, కాన్వాయ్ వెళ్ళే మార్గం, పెన్షన్ పంచె ఇల్లు, సిహెచ్సిను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్.

అనంతరం ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి, ఐపిఎస్ బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై, నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ – రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు బందోబస్తును పదమూడు సెక్టార్లుగా విభజించి, బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసామన్నారు. హెలిప్యాడ్, చీపురుపల్లి సి.హెచ్.సి, రూఫ్ టాప్, రూట్ బందోబస్తు, ప్రజా వేదిక, కార్యకర్తలతో సమావేశం నిర్వహించే స్థలం, పార్కింగు, రోప్ పార్టీలుగా విభజించి, ఒక్కొక్క విభాగానికి ఒక్కో పోలీసు అధికారిని పర్యవేక్షణకు నియమించామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇంచార్జ్ ఎస్పీ ఆదేశించారు. రావివలస గ్రామంకు వెళ్ళే మార్గంలో ఎటువంటి వాహనాలు రహదారిపై నిలప కుండా, వారికి కేటాయించిన పార్కింగు స్థలంలోనే వాహనాలు నిలుపుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఎఎస్ఐలు, హెచ్సిలు, కానిస్టేబుళ్ళు, హెూంగార్డులు, ఆర్మ్ డ్ రిజర్వు, స్పెషల్ పార్టీలతో సుమారు 1200మందిని ముఖ్యమంత్రి బందోస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు.

అనంతరం, ముఖ్యమంత్రి బందోబస్తును విజయవంతం చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహించి, పోలీసు అధికారులు, సిబ్బందికి ఇంచార్జ్ ఎస్పీ భద్రతపరమైన పలు సూచనలు చేసారు. రోప్ పార్టీలు, రూట్ మరియు మూవింగ్ బందోబస్తు నిర్వహించే సిబ్బంది కాన్వాయ్ మార్గంలో ఎటువంటి మార్గాంటంకాలు లేకుండా చూడాలన్నారు. రూఫ్ టాప్లపై విధులు నిర్వహించే భద్రత సిబ్బంది చుట్టూ ఉన్న ప్రాంతాలను, అనుమానస్పద సంచరించే వ్యక్తులను గుర్తించేందుకు బైనాక్యులర్స్ నిశితంగా పరిశీలించాలన్నారు. ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని అధికారులను ఇంచార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి, ఐపిఎస్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి